NMMS గురించి పూర్తి సమాచారం
NMMS గురించి పూర్తి సమాచారం
NMMS అంటే ఏమిటి?
National means cum merit scholarship దీనినే సులభంగా NMMS అంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్ధులకు ఈ స్కాలర్షిప్ పరీక్ష ఒక వరం లాంటిది. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన (క్వాలిఫై) అయిన విద్యార్థులకు వరసగా నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి ₹12000 ( రూపాయలు) వంతున మొత్తంగా ₹48000(రూపాయలు) స్కాలర్షిప్ రూపంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి , ప్రతిభావతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పరీక్షను ప్రతీ విద్యార్థి రాయవచ్చు .
అర్హత ప్రమాణం
2019-20 సంవత్సరంలో అధ్యయనం చేసిన క్లాస్ VII పరీక్షలో అన్ని వర్గాలకు OC / BC విద్యార్థులు కనీసం 55% మార్కులు మరియు SC / ST / PH లేదా సమానమైన గ్రేడ్ విషయంలో 50% మార్కులు సాధించాలి.
జెడ్‌పి / ప్రభుత్వ / స్థానిక సంస్థ / ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో మాత్రమే చదువుతుండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం (తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి) రూ .1,50,000 / - కంటే తక్కువ ఉండాలి.అభ్యర్థులు MRO జారీ చేసిన తాజా అసలు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.
అసలు కుల ధృవీకరణ పత్రాన్ని (MRO జారీ చేసినది) ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాలి.
అభ్యర్థి ఒరిజినల్ VII క్లాస్ పాస్ మెమో ఆఫ్ మార్క్స్ ను ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాలి.
Note:- APResidential ఉన్నత పాఠశాలలు, AP సాంఘిక సంక్షేమ నివాస పాఠశాలలు, APTribal సంక్షేమ నివాస ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమం ఉన్నత పాఠశాలలు మరియు కస్తూర్బా నివాస పాఠశాలలు, నివాస సౌకర్యం ఉన్న మోడల్ పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్‌లో VIII తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలలు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు హాజరు కావడానికి అర్హత లేదు. కనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బాగా చదివి స్కాలర్షిప్ సాధించవచ్చు.
నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు ?
నోటిఫికేషన్ ఆగస్ట్ నెలలో లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది.
పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు?
నవంబర్ మొదటివారంలో సాధారణంగా నిర్వహిస్తారు.
పరీక్షా సరళి
పరీక్షా విధానం క్రింది విధంగా ఉంది:
పరీక్ష రెండు విభాగాలుగా నిర్వహించబడుతుంది
1.మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) - 90 మార్కులకు -90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు.
2.స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ (SAT) - VII & VIII తరగతి యొక్క సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు (భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం ) మరియు గణితాలను కవర్ చేసే 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. మొత్తం 180 మార్కులు.
భౌతిక శాస్త్రం.:- 12 ప్రశ్నలు-12 మార్కులు భూగోళ శాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
రసాయన శాస్త్రం 11ప్రశ్నలు-11మార్కులు చరిత్ర. 10ప్రశ్నలు-10మార్కులు
జీవ శాస్త్రం. 12 ప్రశ్నలు-12 మార్కులు పౌరశాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
గణితము. 20 ప్రశ్నలు-20 మార్కులు అర్థశాస్త్రం 5ప్రశ్నలు-5మార్కులు
ఎంత మందిని ఎంపిక చేస్తారు
దేశం మొత్తం మీద 1లక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి 4087మంది విద్యార్థులను ఈ స్కాలర్షిప్ కు ఎంపిక చేస్తారు.
అర్హత శాతం క్రింది విధంగా ఉంది: (కట్ ఆఫ్ 2019)
Gen 40% BC 35% SC / ST / PH 32%.
దరఖాస్తు ఫారం
దరఖాస్తు ఫారాలు అధికారిక వెబ్‌సైట్ “www.bseap.org” లో ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంటాయి.. దరఖాస్తు ఫారమ్ నింపే ముందు, ప్రధానోపాధ్యాయుడు అదే పేజీలో ఇచ్చిన మార్గదర్శకాల ద్వారా దరఖాస్తు ఫారమ్ నింపాల్సి వుంటుంది.
పరీక్ష ఫీజు: ఓసి / బిసి విద్యార్థులకు రూ .100 / - & .ఎస్సీ / ఎస్టీ / పిహెచ్ విద్యార్థులకు ₹ 50 / -. పరీక్ష రుసుమును ఎస్బిఐ వసూలు ద్వారా మాత్రమే చెల్లించాలి. విద్యార్థుల నుంచి ఈ మొత్తం ను తీసుకుని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫలితం
పరీక్ష విజయవంతంగా నిర్వహించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎంఎంఎస్ 2020 ఫలితం ప్రకటించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎంఎంఎస్ 2019 ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు.
ఫలితం విజయవంతంగా ప్రకటించిన తర్వాత కట్ ఆఫ్ విడుదల అవుతుంది. ఈ రెండు పరీక్షల కోసం విద్యార్థులు కనీసం 40% మార్కులతో MAT మరియు SAT రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ / ఎస్టీ విద్యార్థులకు ఈ కట్ ఆఫ్ 32% మార్కులు.
అవార్డు గ్రహీతకు రూ. సంవత్సరానికి 12000 / -, అవార్డు పొందినవారు వారి తల్లిదండ్రులతో ఏ ఎస్బిఐలో లేదా కోర్ బ్యాంకింగ్ సౌకర్యం / ఇఎస్సి సౌకర్యం ఉన్న ఏదైనా జాతీయం చేసిన బ్యాంకులలో ఉమ్మడి ఖాతా తెరవాలి. రాష్ట్రాల వారీగా బ్యాంక్ ఖాతా నంబర్ జాబితాను అందించినప్పుడు, న్యూ ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తుంది మరియు అవార్డు పొందినవారికి స్కాలర్‌షిప్‌ల పంపిణీ కోసం అలాంటి జాబితాను న్యూ ఢిల్లీలోని ఎస్‌బిఐకి పంపుతుంది. అభ్యర్థి త్రైమాసిక ప్రాతిపదికన న్యూ ఢిల్లీ లోని ఎస్బిఐ ద్వారా స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా పొందుతారు.
ఎలా ప్రిపేర్ అవ్వాలి ?
MAT:-
సంఖ్యా శ్రేణులు:- ఈ విభాగంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన సంఖ్యల శ్రేణి లో ఒక సంఖ్య బదులుగా ? గుర్తు ఉంచుతారు విద్యార్థులు వాటి మధ్య సంబంధం ఆధారంగా జవాబులు గుర్తించాలి.
అక్షర శ్రేణులు :- సంఖ్యా శ్రేణుల వలె ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన అక్షరాల శ్రేణులు ఇవ్వడం జరుగుతుంది. వాటి మధ్య గల సంబంధం ఆధారంగా వాటితో దగ్గర సంబంధం కలిగిన అక్షరాల్ని విద్యార్థులు గుర్తించాలి.
భిన్నమైంది గుర్తించుట :- ఈ ప్రశ్నలో ఇవ్వబడిన ఐచ్చికాలలో నాలుగు ఒకే సంబంధాన్ని కలిగి ఉన్న అంకెలను గాని, పదాలను గాని ,అక్షరాల సమ్మేళనం గాని ఇచ్చి మరొకటి వీటితో సరిపోనిది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి భిన్నమైన దానిని గుర్తించాలి .
పటంలో లోపించిన సంఖ్యను గుర్తించుట :- జ్యామితీయ ఆకారాలు అయినా వృత్తము, చతురస్రము మొదలైన పటాల్లో ఒకదానితో ఒకటి సంబంధంతో కూడిన సంఖ్య లను ఇవ్వడం జరుగుతుంది .వీటిలో లోపించిన సంఖ్యను ? విద్యార్థి గుర్తించాలి .
వర్డ్/నంబర్ అనాలజీ:- ఒక పదం దానితో సంబంధం కలిగిన ఒక పదం,మరొక పదం ఇవ్వబడుతుంది. విద్యార్థి ఈ రెండింటి మధ్య సంబంధం గుర్తించి ,ఇవ్వబడిన మూడో పదంతో ఆటువంటి సంబంధం కలిగిన నాలుగో పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది .ఈ విభాగంలో కొన్ని సార్లు చిత్రాలు ఆంగ్ల అక్షర సమ్మేళనాలు సంఖ్యలకు సంబంధించిన చిన్న చిన్న భావనలు ఇస్తారు.
దత్తాంశ విశ్లేషణ :- పై చిత్ర రూపంలో గాని, లేదా ఇతర చిత్రాల రూపంలో గాని ఇవ్వబడిన దత్తాంశాన్ని విద్యార్థులు చదివి, దానిలోని సమాచారాన్ని గ్రహించి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
లోపించిన అక్షరాలను ఎన్నుకొనుట :- శ్రేణిలో కొన్ని అక్షరాలు లోపింపచేసి చేసి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు వాటి మధ్య గల సంబంధాన్ని గ్రహించి, అక్షరాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
కోడింగ్ అండ్ డీ కోడింగ్ :- ఆంగ్ల అక్షరాలను అంకెలతో జతచేసి కోడ్ చేయడం జరుగుతుంది . దీనిని దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడిన కోడ్ ను డీకోడ్ చేసి, విద్యార్థి తగిన సమాచారం ఎంచుకోవాల్సి ఉంటుంది .కొన్నిసార్లు ఆoగ్ల అక్షరాల కు సంబంధించిన నెంబర్ కూడా అడగడం జరుగుతుంది.
సూక్ష్మీకరణలు :- గణితంలో చతుర్విధ ప్రక్రియలు కు సంబంధించిన (అనగా కలపడం, తీసివేత ,భాగించడం, గుణించడం) ,వర్గ సంఖ్యలు ,ఘన సంఖ్యలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు మొదలైన వాటిని గురించి అడగడం జరుగుతుంది.
మొదటి పటంతో సంబంధం కలిగిన పటాన్ని గుర్తించుట / సమస్య పటిమతో కలిసే పటమును ఎన్నుకొనుట :- ఒక సమస్య పటం ఇచ్చి, దానికి నాలుగు ఐచ్ఛికాలు ఇవ్వబడతాయి. విద్యార్థి వాటిలో సరైన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సారి మొత్తం పటంలో సరిపోయే భాగాన్ని ఎన్నుకో వలసి ఉంటుంది.
A,B పటముల మధ్య సంబంధము గుర్తించి ,C పటము జోడీని గుర్తించుట :- మొదటి రెండు పటముల మధ్య గల సంబంధం ఆధారంగా మూడవ పటానికి సరిపోయే నాల్గవ పటాన్ని కింద ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకోవాల్సి ఉంటుంది.
వెన్ చిత్రాలు
పటము లో దిశాత్మక నిర్మాణాత్మక మార్పులు ఆధారంగా సమాధానం ఎంచుకొనుట
ఇవ్వబడిన పటoలో జ్యామితీయ ఆకారంలను లెక్కించుట :- పటం ఇచ్చి దానిలో వృత్తాల సంఖ్యను, చతురస్రాలు సంఖ్యను, అలాగే త్రిభుజాలు, దీర్ఘ చతురస్రాలు సంఖ్యను అడగడం జరుగుతుంది
ఇవ్వబడిన ఆకారాలలో ఏఏ ఆకారాలతో చదరం ఏర్పడుతుందో గుర్తించుట :- ఇవ్వబడిన నాలుగు, ఐదు భాగాల నుంచి ఏ ఏ భాగాలతో చదరం లేదా చతురస్త్రం ఏర్పడుతుందో గుర్తించాల్సి ఉంటుంది.
Note
ఈ టాపిక్ మీద విద్యార్థులకు అంతగా అవగాహన మొదట్లో ఉండదు కనుక వీటిని చూసి విద్యార్థులు భయపడతారు . ఇప్పటివరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయని విద్యార్థులకు ఇవి కొత్తగా అనిపిస్తాయి .కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటిలో అధికంగా మార్కులు సాధించవచ్చు. ముందుగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు వివిధ రకాల మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చు.
SAT :-
ఈ విభాగంలో 7 ,8 తరగతుల కు సంబంధించిన సాంఘిక శాస్త్రం నుంచి 35 మార్కులు, అలాగే గణితం నుంచి 20 మార్కులు, భౌతిక, రసాయన ,జీవ శాస్త్రాలనుంచి 35 మార్కులకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలు చక్కగా చదవడం ద్వారా 35 మార్కులు సులభంగా సాధించవచ్చు. భౌతిక రసాయన శాస్త్రాలు, గణితం నుంచి కొన్ని ప్రశ్నలు కష్టతరంగా వచ్చే అవకాశం ఉంది . అయినప్పటికీ విద్యార్థులు ప్రతి రోజు రెండు మూడు గంటలు చదవడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
సిలబస్
భౌతిక శాస్త్రం.:- 12 ప్రశ్నలు-12 మార్కులు:-
12.నక్షత్రాలు సౌర కుటుంబం
రసాయన శాస్త్రం 11ప్రశ్నలు-11మార్కులు
జీవ శాస్త్రం. 12 ప్రశ్నలు-12 మార్కులు
గణితము. 20 ప్రశ్నలు-20 మార్కులు :-
చరిత్ర. 10ప్రశ్నలు-10మార్కులు
భూగోళ శాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
పౌర శాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
అర్థశాస్త్రం 5ప్రశ్నలు-5మార్కులు
ఎరుపు రంగులో చూపబడిన పాఠాలు 2019-20 సంవత్సరంలో తొలగించబడినవి
పచ్చ రంగులో చూపబడిన పాఠాలు 2019-20 సంవత్సరంలో కొత్తగా చేర్చబడినవి .

- చలనము- కాలము
- ఉష్ణోగ్రత మాపనము
- వాతావరణం శీతోష్ణస్థితి
- విద్యుత్ ప్రవాహం ఫలితాలు
- గాలి పవనాలు తుఫానులు
- కాంతి పరావర్తనం
- బలము
- ఘర్షణ
- ధ్వని
- సమ తలాల వద్ద కాంతి పరావర్తనం
12.నక్షత్రాలు సౌర కుటుంబం
రసాయన శాస్త్రం 11ప్రశ్నలు-11మార్కులు
- ఆమ్లాలు క్షారాలు
- మన చుట్టూ జరిగే మార్పులు
- మన చుట్టూ ఉన్న పదార్థం
- లోహాలు మరియు అలోహాలు
- కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ లు
- నేల బొగ్గు మరియు పెట్రోలియం
- దహనం ఇంధనాలు మరియు మంట
- ద్రవాల విద్యుత్ వాహకత
జీవ శాస్త్రం. 12 ప్రశ్నలు-12 మార్కులు
- ఆహారం లోని అంశాలు
- పట్టు ఉన్ని
- జీవులలో శ్వాసక్రియ
- మొక్కల్లో ప్రత్యుత్పత్తి
- మొక్కల్లో పోషణ
- విత్తనాల ప్రయాణం
- నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి
- నేల మన జీవనం
- అడవి మన జీవనం
- విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి
- కణం జీవుల మౌలిక ప్రమాణం
- సూక్ష్మజీవుల ప్రపంచం
- జంతువులలో ప్రత్యుత్పత్తి
- కౌమార దశ
- జీవ వైవిధ్య సంరక్షణ
- వివిధ ఆవరణ వ్యవస్థలు
- మొక్కల నుండి ఆహారోత్పత్తి
- జంతువుల నుండి ఆహారోత్పత్తి
- పీల్చలేము తాగలేము
- మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది
గణితము. 20 ప్రశ్నలు-20 మార్కులు :-
- పూర్ణ సంఖ్యలు
- భిన్నాలు దశాంశాలు మరియు అకరణీయసంఖ్యలు
- సామాన్య సమీకరణాలు
- రేఖలు కోణములు
- త్రిభుజ ధర్మాలు
- నిష్పత్తి ఉపయోగాలు
- దత్తాంశ నిర్వహణ
- త్రిభుజాల సర్వసమానత్వం
- త్రిభుజాలు నిర్మాణాలు
- బీజీయ సమాసాలు
- ఘాతాంకాలు
- చతుర్భుజాలు
- వైశాల్యం చుట్టుకొలత
- త్రిమితీయ మరియు ద్విమితీయ ఆకారాలు అవగాహన
- సౌష్టవం
- అకరణీయ సంఖ్యలు
- ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు
- చతుర్భుజాల నిర్మాణాలు
- ఘాతాంకాలు మరియు ఘాతాలు
- అనుపాతంలో రాశులను పోల్చుట
- వర్గమూలాలు ఘన మూలాలు
- పౌనఃపుణ్య విభాజన పట్టికలు, రేఖాచిత్రంలు
- జామితీయ పటాల అన్వేషణ
- సమతల పటముల వైశాల్యములు
- అనులోమ విలోమ అనుపాతములు
- బీజీయ సమాసాలు
- కారణాంక విభజన
- త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట
- ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలు (సమఘనము ,దీర్ఘఘనము)
- సంఖ్యలతో ఆడుకుందాం
చరిత్ర. 10ప్రశ్నలు-10మార్కులు
- కొత్త రాజ్యాలు -రాజులు
- ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం-కాకతీయులు
- విజయనగర రాజులు
- మొగల్ సామ్రాజ్యం
- భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన
- దైవ సంబంధ భక్తి మార్గాలు
- రాజులు కట్టడాలు
- బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు,కౌలుదార్లు
- జాతీయోద్యమం తొలిదశ
- జాతీయోద్యమం మలిదశ
- సాంఘిక ,మత సంస్కరణోద్యమాలు
- ఆధునిక కాలంలో కళలు కళాకారులు
- సినిమా ముద్రణ మాధ్యమాలు
భూగోళ శాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
- వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం
- వర్షము నదులు
- చెరువులు భూగర్భ జలాలు
- మహాసముద్రాలు చేపలు పట్టడం
- యూరప్
- ఆఫ్రికా
- పటాల అధ్యయనం విశ్లేషణ
- సూర్యుడు శక్తి వనరు
- భూచలనాలు రుతువులు
- ధ్రువ ప్రాంతాలు
- అడవులు వినియోగం సంరక్షణ
- ఖనిజాలు గనుల తవ్వకం
పౌర శాస్త్రము 10ప్రశ్నలు-10మార్కులు
- రాష్ట్ర శాసనసభ చట్టాలు తయారీ
- జిల్లాలో చట్టాల అమలు
- కుల వివక్ష సమానత్వానికి పోరాటం
- జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు
- జానపదులు మతం
- భారత ఎన్నికల వ్యవస్థ
- భారత రాజ్యాంగం
- పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం
- చట్టం, న్యాయం -ఒక సన్నివేశ అధ్యయనం
- జమీందారీ వ్యవస్థ రద్దు
- పేదరికం అవగాహన
- హక్కులు అభివృద్ధి
- లౌకికతత్వం అవగాహన
- క్రీడలు జాతీయత వాణిజ్యం
- విపత్తుల నిర్వహణ
అర్థశాస్త్రం 5ప్రశ్నలు-5మార్కులు
- చేతివృత్తులు చేనేత వస్త్రాలు
- పారిశ్రామిక విప్లవం
- ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ
- రవాణా వ్యవస్థ ప్రాధాన్యత
- ద్రవ్యం బ్యాంకింగ్
- జీవనోపాదులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం
- ప్రజారోగ్యం ప్రభుత్వం
ఎరుపు రంగులో చూపబడిన పాఠాలు 2019-20 సంవత్సరంలో తొలగించబడినవి
పచ్చ రంగులో చూపబడిన పాఠాలు 2019-20 సంవత్సరంలో కొత్తగా చేర్చబడినవి .
Comments
Post a Comment